Witeup on Seetha Raamam Movie
ప్రియమైన “సీతారామానికి” వర్షం లో నిన్ను చూడటానికి వచ్చి, మనసుతో చూసి, చెమ్మగిల్లిన కన్నీళ్ల తో రాస్తున్న ఉత్తరమిది.. నువ్వు తొలిసారిగా నా కంట పడినప్పుడే అనిపించింది, ఆశ్వినీదత్ గారి ప్రోత్సాహం కచ్చితంగా వృథా అవ్వదని. ఇప్పుడున్న, క్రమ క్రమంగా వేరే దిశకు వెళ్తున్న ప్రేమ లేని సమాజానికి, ఇంకా చెప్పాలంటే ప్రేమరాహిత్యానికి స్వస్తి చెప్పిన నీ విధానం బాగా నచ్చింది. నిన్నుదృశ్యకావ్యంగా మరల్చిన హను రాఘవపూడి గారు నా మనసుకు కు ఎప్పుడో అందాల రాక్షసుడి గా పరిచయమయ్యి ఎప్పటికీ వదిలి వెళ్ళేలా లేడు, నిన్ను ఈ సారి ఇంకా గొప్పగా చూపించారు. ముఖ్యంగా యుద్దంలో ఉత్తరాలా ప్రేమయాణం, అది కూడా తొలిపరిచయం లోనే అగ్నిసాక్షి గా పరిణయం అయినట్టు, హీరో కి కూడా తెలియనట్టు...ఎంత అద్బుతంగా కనిపించావో తెలుసా ...ప్రణయం తర్వాత పరిణయం అనేది సాధారణం, కానీ అసంకల్పిత పరిణయ సూచకం ప్రణయంగా మారడం వినూత్నం. అలాగే కుంకుమ చెరపడం లో కూడా ఇంత అందంగా ఉంటుందా అని అనిపించేలా చేశావు., ఇంకా చెప్పాలంటే ఆ ఏడు అడుగుల నడకను చూస్తున్నప్పుడు సప్త సముద్రాలన్నీ నన్ను ఒక్కసారిగా ముంచేసినట్టయిం...